చైనీయులు రావొద్దు: రష్యా

19 Feb, 2020 22:10 IST|Sakshi

మాస్కో : కొవిడ్‌–19 వైరస్‌ విజృంభణ కారణంగా ఇప్పటికే చాలా దేశాలు చైనీయులను తమ దేశంలోకి రానివ్వకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి రష్యా చేరింది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ఉపప్రధాని టటైనా గొలికోవా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే చైనా నుంచి పర్యాటక, పని వీసాలతో వచ్చే వారితోపాటు విద్యార్థులకూ ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించారు. అయితే ఈ నిషేధం రష్యా విమానా శ్రయాల మీదుగా ప్రయాణం చేసే వారికి వర్తించదని చెప్పారు. కాగా, ఇప్పటికే చైనా, ఉత్తర కొరియాకు విమానాలు, రైళ్ళ రాకపోకలను నియంత్రించిన రష్యా.. చైనా పౌరులకు వర్క్‌ వీసా జారీని కూడా నిలిపివేసింది.

>
మరిన్ని వార్తలు