టెలిగ్రామ్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన రష్యా

19 Jun, 2020 17:20 IST|Sakshi

మాస్కో: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌పై ఉన్న నిషేధాన్ని రష్యా ఎత్తివేసింది. రష్యా సెన్సార్‌షిప్ విధానాలకు బాధ్యత వహిస్తున్న ఫెడరల్ సర్వీస్ ఫర్ సూపర్‌విజన్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మాస్ మీడియా ఈ ప్రకటన చేసింది. రెండేళ్ల క్రితం టెలిగ్రామ్‌ను ఉ‍గ్రవాదులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భావించిన రష్యా ప్రభుత్వం తమ దేశంలో టెలిగ్రామ్‌పై నిషేధాన్ని విధించింది. రష్యా పారిశ్రామికవేత్త పావెల్ దురోవ్ అభివృద్ధి చేసిన టెలిగ్రామ్‌ను ఉగ్రవాదులు ఉపయోగించారని అధికారులు ఆరోపించారు. దీనికి సంబంధిన ఎన్క్రిప్షన్ డేటాను ప్రభుత్వానికి ఇ‍వ్వాలని ఆదేశించారు. (వైరస్‌ సోకకుండా పుతిన్‌కు భారీ టన్నెల్‌)

అయితే అది వినియోగదారుల గోపత్యకు ఆటంకం అని పావెల్‌ తిరస్కరించారు. దీంతో యాప్‌ను దేశంలో నిషేధిస్తూ 2018లో ఆ దేశ అ‍త్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏప్రిల్ 2018లో టెలిగ్రామ్‌ను దేశంలో బ్లాక్ చేయమని టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లకు సూచించిన తరువాత, ఇది కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది. కానీ కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యింది. నిషేధం విధించిన తరువాత కూడా దేశంలో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీన్ని బ్లాక్‌ చేయడం రష్యా ప్రభుత్వం చేతకాకే నిషేధాన్ని ఎత్తి వేసినట్లు తెలుస్తోంది. 

(చైనాలో పందుల కొరత.. రష్యా విమానాలకు గిరాకీ)

టెలిగ్రామ్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు  తెలుసుకుందాం.

  • ఈ యాప్‌ ద్వారా 200,000 మంది వరకు గ్రూపులోసందేశాలు, ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది. 
  • ఇది చాలా ప్రజాదరణ పొందింది. 
  • గత మార్చినెలలో కేవలం  30 రోజుల్లోనే దీనిని 200 మిలియన్ల మంది ఉపయోగించారు.
  • ఇప్పటి వరకు ఇంత ఎక్కువగా ఏ యాప్‌ని ఉపయోగించలేదని టెలిగ్రామ్‌ సంస్థ తెలిపింది.
  • టెలిగ్రామ్‌ను ఒకదేశంగా భావిస్తే ఎక్కువ జనాభా ఉన్నదేశాల్లో ఇది ఆరవ దేశంగా నిలిచేది. 


 

మరిన్ని వార్తలు