రష్యాలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

1 Jun, 2020 12:05 IST|Sakshi

మాస్కో: రష్యాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,268 కేసులు నమోదుకాగా.. 138 మరణాలు సంభవించాయి. కాగా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,05,843గా ఉండగా మరణాల సంఖ్య 4,693గా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే రష్యాలో మరణాలరేటు తక్కువగా ఉంది.

అయితే రాజకీయ కారణాల వల్ల కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఉప ప్రధాని టాట్యానా గోలికోవా వివరణ ఇచ్చారు. ఇతర రోగాలు లేకుండా.. కేవలం కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందుతున్న వారినే ఇందులో చేరుస్తున్నట్లు చెప్పారు. కాగా రష్యాలో ఒక రోజులో 9వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. చదవండి: భారత్‌లో కొత్తగా 8,392 కరోనా కేసులు 

మరిన్ని వార్తలు