చిక్కుల్లో రష్యా ఆర్థికమంత్రి.. భారీ లంచం

16 Nov, 2016 08:14 IST|Sakshi
చిక్కుల్లో రష్యా ఆర్థికమంత్రి.. భారీ లంచం

మాస్కో: రష్యా ఆర్థిక మంత్రి చిక్కుల్లో పడ్డాడు. ఓ ఆయిల్ కంపెనీ కొనుగోళ్లకు సంబంధించి అవినీతికి పాల్పడ్డాడని తేల్చిన విచారణ కమిటీ అదుపులోకి తీసుకుంది. రష్యా ఆర్థికమంత్రిగా అలెక్సీ ఉల్యుకేవ్ పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్ మరో కంపెనీ బాష్ నెట్ ను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చేందుకు రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై రష్యా విచారణ సంస్థ దర్యాప్తు చేసి ఆయనను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది.

’ఉన్నత స్థాయి కేసులను పరిశీలన చేసే రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ అలెక్సీపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది’ అని రష్యా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 14న (సోమవారం) ఆయన ఈ లంచం తీసుకున్నట్లు తెలిసిందని వెల్లడించారు. ఆర్థికమంత్రి చేసిన ఈ చర్యను తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని క్రెమ్లిన్ అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.

మరిన్ని వార్తలు