స్టూడెంట్‌ను ప్రేమించి.. ఆపై తెగ నరికాడు!

12 Nov, 2019 16:13 IST|Sakshi

రష్యన్‌ నవలాకారుడు, ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్‌ ఒలేగ్ సొకోలోవ్(63) కోపంలో తన ప్రేయసి, మాజీ విద్యార్థిని అయిన అనస్తేసియా యెష్‌చెంకో(24)ను క్షణికావేశంలో అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై.. ఆమె తల, చేతులు, కాళ్లను వేరుచేశాడు. అంతేకాక అనస్తేసియా శరీరభాగాలను కనిపించకుండా చేసి, ఆ తర్వాత తనను ఎంతగానో ప్రభావితం చేసిన నెపోలియన్‌ వస్త్రధారణలో బహిరంగంగా ఆత్మహత్య చేసుకోవడానికి పథకం పన్నినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హిస్టరీ  ప్రొఫెసర్‌ ఒలేగ్ సొకోలోవ్ శనివారం తాగిన మైకంలో మొయికా నదిలో జారిపడి.. అక్కడి పోలీసులకు చిక్కాడు.

అనుమానస్పదంగా కనిసిస్తున్న సోకోలోవ్‌ను  పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని బ్యాగ్‌ను చెక్‌ చేయగా.. అందులో కత్తిరించిన మహిళ చేతులు ఉన్నాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు .. యూనివర్సిటీ మాజీ విద్యార్థిని, తన ప్రేయసి అయిన అనస్టేసియా తలలేని శరీరాన్ని(మొండెం) పోలీసులు సొకోలోవ్ ఇంట్లో గుర్తించారు. పోలీసులకు సీసీ కెమెరాలను చెక్‌ చేయగా.. మొయికా నది సమీపంలో సంచరిస్తూ.. తన బ్యాగ్‌ను నదిలో పారివేసే క్రమంలో  కాలుజారి నదిలో పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. దీంతో ఆమెను హతమార్చాననే పోలీసులకు అసలు విషయం చెప్పాడు. నేరాన్ని అంగీకరించిన ప్రొఫెసర్ సొకొలోవ్, అనస్టేసియా హత్యపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారని సమాచారం.


ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్‌ ఒలేగ్ సొకోలోవ్, అనస్తేసియా యెష్‌చెంకో

రష్యాలోని సెయింట్‌ పీటర్‌బర్గ్‌ యూనివర్సిటీలో ప్రముఖ చరిత్ర విభాగపు ప్రొఫెసర్‌గా ఒలేగ్ సోకోలోవ్‌కు మంచి పేరుంది. ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్‌ బోనపార్టేపై అనేక పుస్తకాలు రాయడంతో పాటు ఆయన చేసిన కృషికిగాను ఫ్రాన్స్‌ ప్రతిష్టాత్మక పురస్కారం 'లీజన్ ఆఫ్ ఆనర్' అవార్డును సొంతం చేసుకున్నారు. సొకోలోవ్ ఇంత దారుణానికి పాల్పడతారని తాము ఎన్నడూ ఊహించలేదని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనస్టేసియాను సొకొలోవ్ హత్య చేసిన నేపథ్యంలో.. ఫ్రెంచ్ అకడెమిక్ ఇన్స్టిట్యూట్ రష్యన్ కిల్లర్ ప్రొఫెసర్‌ను విధుల నుంచి బహిష్కరించింది. సొకోలోవ్, అనస్తేసియా కలిసి ఫ్రెంచ్ చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు పుస్తకాలు కూడా రాశారు. అంతేకాక వీరిద్దరికి చారిత్రక శైలిలో దుస్తులు ధరించడానికి మక్కువ చూపేవారని తెలిసింది. నెపోలియన్ ప్రభావం అధికంగా ఉన్న సొకొలోవ్‌కు.. నెపోలియన్‌ తరహా బట్టలు వేసుకోవడమంటే అమితమైన ఇష్టం. అనస్టేసియాను ఆయన 'జోసెఫిన్' అని ఎంతో ప్రేమగా పిలిచేవారని యూనివర్సిటీ విద్యార్థులు గుర్తు చేశారు. ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్ మొదటి భార్య పేరు జోసెఫిన్ కావడంతో ఆమెను ముద్దుగా ఆ పేరుతో పిలిచేవారు.

ఇక ప్రొఫెసర్ సొకోలోవ్ 'హైపోథెర్మియా' అనే వ్యాధితో ఇబ్బంది పడుతూ..  ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారని న్యాయవాది పొచుయేవ్ తెలిపారు. హైపోథెర్మియా వ్యాధి బారిన పడిన వారికి శరీరంలో వేడి జనించడం కన్నా.. వేగంగా వేడిని కోల్పోతారు. దీనివల్ల రోగి శరీర ఉష్ణోగ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయి గుండె, నాడీవ్యవస్థతో పాటు అవయవాల పనితీరు దెబ్బతింటుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా