3,000 మందిని చంపిన రష్యా

20 Jan, 2016 19:56 IST|Sakshi
3,000 మందిని చంపిన రష్యా

డెమాస్కస్: రష్యా వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 3,000మంది ప్రాణాలుకోల్పోయారని సిరియా పరిశీలన సంస్థ ఒకటి వెల్లడించింది. గత ఏడాది(2015) సెప్టెంబర్ 30 నుంచి  ఇప్పటి వరకు రష్యా లెక్కలేనిసార్లు సిరియాలో వైమానిక బాంబు దాడులు జరిపిందని ఈ దాడుల్లో ఉగ్రవాదులతోపాటు సామాన్యులు కూడా మృత్యువాత పడ్డారని ఆ సంస్థ పేర్కొంది.

మొత్తం మూడు వేలమంది ఈ దాడుల కారణంగా చనిపోగా వారిలో సామాన్యులు 1,015 మంది ఉన్నారని, వారిలో 238 మంది 18 ఏళ్లలోపువారు, 640మంది పురుషులు, 137మంది మహిళలు ఉన్నట్లు సిరియా హక్కుల సంస్థ ఓ పత్రికకు వివరాలు తెలియజేసింది. ఇక ఇదే దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఎక్కువగా చనిపోయారని పేర్కొంది. మొత్తం 893 మంది ఐఎస్ ఉగ్రవాదులు చనిపోగా.. ఇతరులు అల్ కాయిదావంటి జిహాదీ గ్రూపులకు చెందినవారు 1,141 మంది మరణించినట్లు వివరించింది. అయితే, రష్యా ఈ దాడులను సిరియా బలగాలకు మద్దతుగానే జరిపినట్లు ఆ హక్కుల సంస్థ వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు