రష్యా తాలిబన్కు అమెరికా జీవిత ఖైదు

4 Dec, 2015 06:48 IST|Sakshi

వాషింగ్టన్: రష్యాకు చెందిన ఓ తాలిబన్కు అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు చనిపోయేవరకు జైలులోనే ఉంచాలని ఆదేశించింది. అఫ్గనిస్థాన్లో అమెరికా విమానంపై దాడి చేయడమే కాకుండా అందులోని అమెరికా, అఫ్గనిస్థాన్ సైనికులపై కూడా కాల్పులు జరిపేందుకు కారణమైన కేసులో అతడికి అమెరికా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

ఇరెక్ ఇజిజ్ హమిదుల్లిన్ (55) అనే రష్యాకు చెందిన పౌరుడు ఉగ్రవాద సంస్ధథ తాలిబన్లలో చేరిపోయి ఉగ్రవాద కార్యకలాపాలకు దిగాడు. నవంబర్ 28న 2009లో అఫ్గనిస్థాన్లో అమెరికా సైన్యం, విమానంతోపాటు, అఫ్గనిస్థాన్ సైనికులపై కూడా దాడులకు పాల్పడి పలువురు హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి కోర్టు శిక్ష విధించింది.  
 

మరిన్ని వార్తలు