బేస్ జంప్‌లో నయా వరల్డ్ రికార్డ్

27 Oct, 2016 18:10 IST|Sakshi
బేస్ జంప్‌లో నయా వరల్డ్ రికార్డ్

బీజింగ్: చైనాలో మంచుతో కూడిన పర్వతప్రాంతం చొ వోయు. 25,262 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడానికే పర్వతారోహకులు నానా అవస్థలు పడతారు. అలాంటిది ఓ వ్యక్తి ఆ పర్వతం అంచునుంచి బేస్ జంప్ చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

రష్యాకు చెందిన అథ్లెట్ వలెరి రొజోవ్ బేస్ జంప్‌లో తన పేరిట ఉన్న వరల్డ్ రికార్డును మరోసారి బ్రేక్ చేశాడు. గతంలో హిమాలయ పర్వతశ్రేణుల్లో 23,688 అడుగుల ఎత్తునుంచి బేస్ జంప్ చేసి రొజోవ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అయితే చైనాలోని చొ వోయు పర్వతాల్లో 25, 263 అడుగుల ఎత్తు నుంచి బేస్ జంప్ చేయాలనేది అతడి స్వప్నం. దీని కోసం తీవ్రంగా సాధన చేసిన అతడు ఎట్టకేలకు సాధించాడు. చొ వోయు పర్వత అంచుకు చేరుకోవడానికే రొజోవ్‌కు 21 రోజులు పట్టింది. వింగ్ సూట్‌తో బేస్ జంప్ చేసిన రొజోవ్ చివర్లో పారాచూట్ సహాయంతో 90 సెకన్లలో క్షేమంగా మంచుపై దిగాడు. రొజోవ్ సాహసకృత్యానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరిచే ఔరా అనిపిస్తున్నాయి.


మరిన్ని వార్తలు