వావ్‌.. పుతిన్‌ ఇందులో కూడా దిట్టేనా..

14 May, 2017 20:05 IST|Sakshi
వావ్‌.. పుతిన్‌ ఇందులో కూడా దిట్టేనా..

బీజింగ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ గురించి మరో విషయం కూడా తెలిసింది. ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో దిట్ట అయిన ఆయన సంగీతం వాయించడంలో కూడా ఘనాపాటే అని తెలిసింది. ఆయన పియానో కూడా చక్కగా వాయించగలరు. ఈ విషయం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అధికారిక నివాసం వేదికగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్‌లో సిల్క్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సమావేశానికి సంబంధించి ఆదివారం ఉదయమే మాట్లాడిన పుతిన్‌ అనంతరం జిన్‌పింగ్‌ అధికారిక నివాసం అయిన దియాయుతాయ్‌కు చేరుకున్నారు. ఆ ఇంట్లో ఓ చోట ఉన్న పియానో వద్దకు వెళ్లి జిన్‌ పింగ్‌ వచ్చే వరకు సరదాగా పియానో వాయించుకుంటు కూర్చున్నారు. దీనిని ఉత్సాహవంతులైన జర్నలిస్టులు, ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. రష్యాకు చెందిన పాటలనే పుతిన్‌ ఈ పియానోపై వాయించినట్లు టీఏఎస్‌ఎస్‌ అనే న్యూస్‌ చానల్‌ తెలిపింది.

>
మరిన్ని వార్తలు