శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

14 Jun, 2019 03:04 IST|Sakshi

కొలంబో : శ్రీలంక జాతీయ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా మేజర్‌ జనరల్‌ రువాన్‌ కులతుంగ నియమితులు కానున్నారు. ఉగ్ర దాడుల గురించి ఇంటెలిజెన్స్‌ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సిసిరా మెండిస్‌ ఆరోపించడంతో అధ్యక్షుడు సిరిసేన మెండిస్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సిరిసేన గతవారం విచారణకు ముందే మెండిస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ తౌహీద్‌ జమాత్‌ జరిపిన బాంబ్‌ దాడులు అనంతరం పోలీస్‌ చీఫ్‌ పూజిత్‌ జయసుందర, రక్షణ శాఖ ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలను కూడా సిరిసేన విధుల నుంచి తొలగించారు.   

మరిన్ని వార్తలు