కరోనా : భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు

7 Apr, 2020 10:41 IST|Sakshi

భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే మహ్మమారి కరోనా వైరస్‌ భారత్‌పై ప్రభావం చూపినా.. కొంతమేర కట్టడి చేయగలిగాం అనేది అందరికీ తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రశంసలు కురిపించింది. అయితే కోవిడ్‌-19కు ఇప్పటి వరకు విరుగుడు కనిపెట్టకపోవడం ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌తో పాటు పారాసిట్‌మాల్‌ ఔషధాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నారు. (మూడోదశకు కరోనా: ఎయిమ్స్‌)

ఈ క్రమంలోనే వైరస్‌ విజృంభణతో వేలసంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్న అమెరికాకు భారత్‌ ఆపద్భాందవుడిలా కనిపింది. హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను తమకు కూడా ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రభుత్వానికి కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్‌ స్వయంగా ఫోన్‌ చేసి.. ఈ మెడిసిన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అమెరికన్‌ కంపెనీలు మెడిసిన్‌ కోసం భారత్‌కు అర్డర్‌ కూడా పెట్టుకున్నాయి.  అయితే భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజరోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌ ఔషధ అవసరాన్ని గుర్తించింది. ఇతర దేశాలకు ఆ మెడిసన్‌ ఎగుమతులను నిషేధిస్తూ మార్చి 24న ఉత్తర్వులు జారీచేసింది. (భారత్‌ సహాయాన్ని కోరిన ట్రంప్‌)

మరోవైపు అమెరికా, సార్క్‌ దేశాలతో పాటు మరో 30 దేశాలు భారత్‌ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మేరకు హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే వీటికి కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ప్రస్తుతం టాబ్లెట్ల వినియోగం పెద్ద ఎత్తున ఉండటంతో.. వీలైనంత స్టాక్‌ను తమ వద్ద ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కాగా భారత్‌లో కరోనా బాధితులకు ప్రస్తుతం​ హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే

>
మరిన్ని వార్తలు