'వర్సిటీపై దాడి'కి వీసీ కూడా బాధ్యుడే

31 Jan, 2016 16:52 IST|Sakshi
'వర్సిటీపై దాడి'కి వీసీ కూడా బాధ్యుడే

'సరిహద్దు గాంధీ' బిరుదాంకితుడు, బచా ఖాన్ గా ఖ్యాతిగడించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరుమీద నెలకొల్పిన విశ్వవిద్యాలయంలో రక్తపుటేరులు పారించిన తాలిబన్ ఉగ్రవాదుల దుశ్చర్యను యావత్ ప్రపంచం ఖండించింది. జనవరి 20న జరిగిన ఉగ్రదాడిపై ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రాథమిక నివేదికను సమర్పించిన ఆ కమిటీ  దాడి ఘటనలో వర్సిటీ పెద్దల బాధ్యతారాహిత్యం స్పష్టంగా బయటపడిందని పేర్కొంది.

వర్సిటీ భద్రతపై వీసీ ఫజల్ ఉర్ రహీమ్ మర్వత్, సెక్యూరిటీ ఇన్ చార్జి అష్ఫ్రాక్ అహ్మద్ ల నిర్లక్ష్యం వల్లే ఉగ్రవాదులు లోపలికి సులువుగా చొరబడగలిగారని, 21 మంది మరణాలకు వారు కూడా బాధ్యులేనని, తక్షణ వారిని విధుల నుంచి తొలిగించాలని దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 'వర్సిటీ ప్రాంగణంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారుగానీ వాటిని పర్యవేక్షించే కేంద్రీయ వ్యవస్థ ఏర్పాటును విస్మరించారు. ఒకవేళ ఆ వ్యవస్థ పనిచేసి ఉంటే ఉగ్రవాదుల చొరబాటును సులువుగా నివారించే వీలుండేది. విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో వర్సిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు' అని నివేదికలో పొందుపర్చారు.

మరిన్ని వార్తలు