ఉప్పునీరు మంచినీరుగా

4 Jul, 2017 04:06 IST|Sakshi
ఉప్పునీరు మంచినీరుగా
సముద్రనీటిని మంచినీటిగా మార్చేందుకు రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన, చౌకైన మార్గాన్ని ఆవిష్కరించారు. కరెంటు అవసరం లేకపోవడం, సూర్యరశ్మిని మాత్రమే వాడుకుని నిర్లవణీకరణ (ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ)ను పూర్తి చేయడం ఈ పద్ధతి తాలూకూ విశేషం. సముద్ర నీటిని మంచినీటిగా మార్చే ప్రస్తుత పద్ధతులు ఎంతో వ్యయప్రయాసలతో కూడు కున్నవి కావడంతో చౌకైన నిర్లవణీకరణ పద్ధతి కోసం రైస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

నానో టెక్నాలజీ సాయంతో ఒకవైపు నీటిని వేడి చేస్తూనే ఇంకోవైపు వాటిలోని లవణాలను ఫిల్టర్‌ చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఉప్పు నీటిని వేడి చేసేందుకు సోలార్‌ ప్యానెల్స్‌ను మాత్రమే వాడటం.. పీడనానికి గురిచేయాల్సిన అవసరం కూడా లేకపోవడంతో ఈ సరికొత్త పద్ధతి ద్వారా అతిచౌకగా మంచినీటిని పొందవచ్చునని శాస్త్రవేత్త నియోమీ హాలస్‌ తెలిపారు. ఫొటోలో చూపినట్లు ఉండే వ్యవస్థ ద్వారా గంటకు ఆరు లీటర్ల మంచినీరు ఉత్పత్తి చేయవచ్చునని చెప్పారు. 
మరిన్ని వార్తలు