భూమిలాంటిదే!

30 Jun, 2014 02:38 IST|Sakshi
భూమిలాంటిదే!

ఈ గ్రహం కూడా అచ్చం మన భూగోళం మాదిరిగానే ఉందట. మనకు కేవలం 16 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న గ్లీస్ 832 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతోన్న దీనిని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటిదాకా మన భూమిని పోలిన 22 గ్రహాలను కనుగొనగా.. వాటన్నింటికంటే ‘గ్లీస్ 832సీ’ అనే ఈ కొత్త గ్రహమే జీవుల ఆవాసానికి ఎక్కువ అనుకూలంగా ఉండవచ్చని చెబుతున్నారు. భూమి కన్నా ఐదు రెట్లు పెద్దగా ఉన్న ఈ గ్రహంపై నీరు ద్రవరూపంలో ఉంటుందని, రుతువులు కూడా ఏర్పడవచ్చని భావిస్తున్నారు. ఏదైనా ప్రత్యేక వాతావరణ అంశాలు ఉంటే తప్ప.. చాలావరకూ ఇది జీవులకు అనుకూలమేనని అంటున్నారు. అయితే ఈ గ్రహం మన భూమిలా తన నక్షత్రానికి దూరంగా కాకుండా..

చాలా దగ్గరగా తిరుగుతోందట. అయినా ఆ నక్షత్రం మన సూర్యుడి కన్నా తక్కువ ప్రకాశవంతంగా, తక్కువ వేడిగా ఉండటం వల్ల దీనిపై వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. అన్నట్టూ.. ఈ గ్రహంపై జస్ట్ 36 రోజులకే ఒక సంవత్సరం అయిపోతుందట! ఎందుకంటే ఇది 36 రోజులకే తన నక్షత్రాన్ని చుట్టి వస్తోంది మరి!!
 

 

మరిన్ని వార్తలు