ఉద్యోగుల కోత: ఏడేళ్లలో మొదటిసారి

3 Jul, 2017 09:32 IST|Sakshi
ఉద్యోగుల కోత: ఏడేళ్లలో మొదటిసారి

సియోల్‌: దక్షిణ కొరియా కు చెందిన అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌,  మెమరీ చిప్ తయారీదారు శాంసంగ్‌  ఎలక్ట్రానిక్స్ కూడా  తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా  తగ్గించింది.  ఏడు సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా  ఉద్యోగుల నియామకాల్లో కోత పెట్టింది. ముఖ్యంగా చైనాలో  పునర్నిర్మాణం లాంటి చర్యల కారణంగా   ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఆదివారం వెల్లడైన సంస్థ  డేటా ప్రకారం నియామకాలు 5.2 శాతం క్షీణించింది.   2016 నాటికి  ప్రపంచంలో  శాంసంగ్‌ ఉద్యోగుల  సంఖ్య   325,677 గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 325,677 మంది ఉద్యోగులున్నారు. అయితే  మహిళా ఉద్యోగ నియామకాల్లో పెరుగుదలను నమోదు చేయం  విశేషం.

కంపెని అధికారిక యంత్రాంగాన్ని దాని ప్రింటింగ్ బిజినెస్ను హెచ్‌పీ​కు విక్రయించడంతో  పాక్షికంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. చైనా మరియు ఇతర ఆసియా దేశాలలో శాంసంగ్ కర్మాగారాలలో కార్పొరేట్ పునర్నిర్మాణము కూడా విదేశీ ఉద్యోగాల కోతకు దారితీసింది. సంస్థకు  దేశీయంగా ఉద్యోగుల సంఖ్య 3.8 శాతం తగ్గి 93,204 కు చేరుకుంది.  విదేశాల్లో 5.8 శాతం పతనమై  2,15,541 కు చేరింది. గత ఏడాది చివరి నాటికి, శాంసంగ్ కంపెనీల విదేశీ ఉద్యోగుల సంఖ్య 0.4 శాతం తగ్గి 69.8 శాతంగా ఉంది.

అదే చైనాలో  అయితే శాంసంగ్‌ ఉద్యోగుల సంఖ్య 17.5శాతం తగ్గి 44,948 నుంచి 37,070కు పడిపోయింది. ఉత్తర, దక్షిణ అమెరికాలలో 8.5 శాతం పెరిగి 25,988 కు చేరింది.  

మహిళా ఉద్యోగుల నిష్పత్తి య2 శాతం క్షీణతను నమోదు చేసి 44 శాతంగా ఉంది.  మరోవైపు మహిళా మేనేజర్లు మరియు కార్యనిర్వాహకుల నిష్పత్తి గత ఏడాది వరుసగా12.7 శాతం , 6.3 శాతం పెరిగింది.  గత ఏడాదితో  12.4 శాతం మరియు 4.5 శాతం తోపోలిస్తే ఈపెరుగుదలను నమోదు చేసింది.
కాగా  శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 2016 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 2,468 సహకార వ్యాపార భాగస్వాములను కలిగి ఉంది.  అలాగే ప్రపంచవ్యాప్తంగా 238 ప్రధాన ఉత్పత్తి సౌకర్యాలు, 53 పంపిణీ కేంద్రాలు, 34 పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలు, ఏడు డిజైన్ కేంద్రాలు మరియు 73 సర్వీసు సెంటర్లు  ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు