యాపిల్ పై శాంసంగ్ దే పైచేయి!

27 Feb, 2016 09:24 IST|Sakshi
యాపిల్ పై శాంసంగ్ దే పైచేయి!

వాషింగ్టన్: ప్రముఖ ముబైల్ తయారీ సంస్థ యాపిల్ పై పోరులో దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ పైచేయి సాధించింది. 825 కోట్ల రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో శాంసంగ్ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదంటూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. యాపిల్ సంస్థ తన యాప్స్ ను శాంసంగ్ కాపీ కొట్టిందని, యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ చేసిన ఫెడరల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో యాపిల్ పటీషన్ ను కొట్టిపారేసింది.

క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైట్ టు అన్ లాక్', ఆటో కరెక్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో శాంసంగ్ తమ పేటేంట్ రైట్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించింది. యాపిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో పాటు.. శాంసంగ్ పేటేంగ్ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడించదని పిటిషన్ వేసిన ఐఫోన్ సంస్థకు ఝలక్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత శాంసంగ్ ప్రతినిధి మాట్లాడుతూ... పోటీ అనేది మార్కెట్లోనే తప్ప కోర్టులో కుదరదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యాపిల్ ఖండించింది. యాపిల్, శాంసంగ్ గత కొన్నేళ్లుగా ముబైల్ టెక్నాలజీలో పోటీ పడుతున్నాయి. గత డిసెంబర్‌లో ఇదే విధంగా మరో పేటేంట్ విషయంలో దాఖలైన కేసులో యాపిల్‌కు దాదాపు 3,770 కోట్ల రూపాయలు సమర్పించుకుంది.

మరిన్ని వార్తలు