ప్రకృతి బీభత్సం; గగుర్పొడిచే దృశ్యాలు

7 Jun, 2018 14:36 IST|Sakshi
శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది(ఇన్‌సెట్‌లో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు)

గ్వాటెమాలా సిటీ: ప్యూగో అగ్నిపర్వతం సృష్టించిన విలయం నుంచి గ్వాటెమాలా ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటివరకున్న అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 90కి పెరిగింది. లావాతో పేరుకుపోయిన శిథిలాల కింద కనీసం 200 మంది సజీవసమాధి అయి ఉంటారని అంచనా. వాయువేగంతో ఉప్పెనలా దూసుకొచ్చిన లావా... లాస్‌ లోటెస్‌, శాన్‌మిగుయెల్‌,  ఎల్‌రోడియో తదితర ప్రాంతాలను ముంచెత్తింది. (ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు)


శాటిలైట్‌ ఫొటోల్లో ప్రకృతి బీభత్సం: గ్వాటెమాలాలోని ప్యూగో అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సానికి సంబంధించి శాటిలైట్లు చిత్రీకరించిన ఫొటోలు విడుదలయ్యాయి. కొద్ది నెలల కిందట ఆ ప్రాంతం ఎలా ఉండేదో.. అగ్నిపర్వతం బద్దలై, లావా ముంచెత్తిన తర్వాత ఎలా తయారైందో స్పష్టంగా కనిపిస్తుంది.
శాటిలైట్‌ ఫొటోలు(ప్యూగో సమీప గ్రామం): ఫిబ్రవరి 5న అలా, జూన్‌ 6న ఇలా)

కొనసాగుతోన్న సహాయక చర్యలు: ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకాగా బుధవారం నాటికి వేడిమి కాస్త తగ్గింది. దీంతో పెద్ద ఎత్తున సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాలను తొలగిస్తూ, మృతదేహాలను గుర్తించేపని చేపట్టామని, చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని, శిథిలాల తొలగింపు ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిబిరాల్లో తలదాచుకున్న మూడు గ్రామాల నిర్వాసితులు ఇంకొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి.

(ఏప్రిల్‌ 7 నాటి ఫొటో, జూన్‌ 6 నాటికి ఇలా)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు