జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన

2 Jun, 2020 11:00 IST|Sakshi

సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు  లేదు: సత్య నాదెళ్ల

జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతాం : గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

వాషింగ్టన్‌ : ఆఫ్రికన్-అమెరికన్  పౌరుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై  టెక్‌ దిగ్గజాలు, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.  గూగుల్‌ సీఈవో  సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు.  నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !)

ఇప్పటికే  జార్జ్‌ ప్లాయిడ్‌ మృతిపట్ల  సెర్చ్ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌  సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో  ఉన్న వారెవ్వరూ  ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ  స్క్రీన్ షాట్ ను  ఆయన  ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి  తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం)

మరిన్ని వార్తలు