స్మగ్లింగ్ చేస్తూ.. అడ్డంగా దొరికాడు

28 Jan, 2016 18:58 IST|Sakshi
స్మగ్లింగ్ చేస్తూ.. అడ్డంగా దొరికాడు

సౌదీ అరేబియాలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. మత్తు పదార్థాలు ఏలాంటి రూపంలో ఉన్న స్వీకరించడం ఇస్లాం ప్రకారం నేరం. కురాన్ నుంచి స్వీకరించిన షెహరియా చట్టాలను సౌదీ అరేబియాలో అమలు చేస్తున్నారు. దీంతో మత్తు పదార్థాలు ఏ రకమైన రూపంలోనూ వాడకూడదు. మద్యాన్ని సౌదీ అరేబియాలోకి స్మగ్లింగ్ చేస్తే కఠినమైన శిక్షలు తప్పవు.

అయినా కానీ, ఓ వ్యక్తి మద్యాన్ని స్మగ్లింగ్ చేయడానికి యత్నించాడు. సౌదీ సాంప్రదాయ దుస్తులను ధరించి ఈ పనికి ఒడిగట్టాడు. అయితే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. కస్టమ్స్ అధికారులు ఎలా స్మగ్లింగ్ చేయడానికి యత్నించాడో ఫోటోలు తీసి తమ అధికారిక ట్విట్టర్లో ట్విట్ చేశారు.10 రెడ్ లేబుల్ బాటిళ్లను తమ కళ్లుగప్పి దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నించి దొరికిపోయాడని పేర్కొన్నారు.

అయితే వారి ట్వీట్కు కామెంట్లు కూడా చాలానే వచ్చాయి. చాలా సేపు అన్ని బాటిళ్లను ఆ ప్రదేశంలో పెట్టుకొని ప్రయాణించిన అతని సహనానికి అందరూ మెచ్చుకుంటున్నారు. కఠిన శిక్షలు ఉంటాయని తెలిసి తెగించి మరీ ధైర్యంగా వచ్చి దొరికినందుకు(ట్విట్టర్లో) కొందరు సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు