బాసూ... నాకు మెమరీ లాసూ....

5 Jul, 2014 15:20 IST|Sakshi
బాసూ... నాకు మెమరీ లాసూ....
39 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఈ 39 ఏళ్లు దేశదేశాలు తిరిగాడు. తానెవరో తెలియకుండానే నాలుగు దేశాలు దాటేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత సొంత ఊరుకు చేరుకున్నాడు. 
 
ఇదేదో సినిమా కథ లా ఉంది కదూ. కానీ ఇన్ని నమ్మలేని నిజం. 1975 లో సౌదీ అరేబియాలోని బురాయ్ దా పట్టణంలో ఒక కుర్రాడు ఇంట్లో బయలుదేరి రోడ్డు మీదకి రాగానే ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని జ్ఞాపకశక్తిపోయింది. తానెవరో, ఏమిటో, ఎక్కడివాడో మరిచిపోయాడు. కనిపించిన బస్సు ఎక్కాడు. దొరికిన రైలు పట్టుకున్నాడు. కాకపోతే కాలి నడకన ప్రయాణించాడు.
 
అలా సౌదీ అరేబియా నుంచి ఇరాక్ కి వెళ్లాడు. ఇరాక్ నుంచి ఇరాన్ కి వెళ్లాడు. ఇరాన్ నుంచి పాకిస్తాన్ కి వచ్చాడు. ఇంత ప్రయాణం చేస్తున్నా ఎక్కడా ఏ పోలీసులకూ చిక్కలేదు. చివరికి పాకిస్తాన్ లో పోలీసులు పట్టుకుని ఏడాది పాటు జైల్లో ఉంది, ఆ తరువాత విడిచిపెట్టారు. అప్పటికి అతని వయస్సు 31 ఏళ్లు.
 
 ఆ తరువాత పాకిస్తాన్ లో గత 39 ఏళ్లుగా ఆ తల్లి పెడితే ఒక రోజు, ఇంకో తల్లి పెడితో ఇంకో రోజు తిని బతికాడు. అతని మాట సౌదీ అరేబియన్  భాషను పోలి ఉండటంతో ఒక మహిళ సౌదీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. చివరికి విచారించగా అతను సౌదీ అరేబియన్ అన్నవిషయం వెల్లడైంది. ఇప్పుడు పౌదీ అధికారులు అతను ఎవరో, ఎక్కడివాడో నిగ్గు తేల్చి ఇంటికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
'హూ యామ్ ఐ, మై కోన్ హూ, నేనెవరిని' అని పాకిస్తాన్ లో 39 ఏళ్లు గడిపిన ఈ వ్యక్తికి ఇప్పుడు 70 ఏళ్లు. 
 
మరిన్ని వార్తలు