11 మంది యువరాజులు అరెస్టు

5 Nov, 2017 10:56 IST|Sakshi
అరెస్టైన వ్యక్తుల్లో ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన అల్‌వాలీద్‌ బిన్‌ తలాల్‌

రియాద్‌ : పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వ అరెస్టు చేసింది. రాజుగా మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్‌ను సౌదీ ప్రారంభించింది. కమిషన్‌ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే అరెస్టులు జరగడం గమనార్హం.

అంతకుముందు సౌదీ నేషనల్‌ గార్డ్‌ హెడ్‌, నేవీ చీఫ్‌, ఆర్థిక శాఖ మంత్రులను సల్మాన్‌ పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిషన్‌ పాత కేసులను తిరగదోడిన నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్ధ ‘అల్‌ అరేబియా’ పేర్కొంది. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.

మరిన్ని వార్తలు