ఆధార్‌తో 58వేల కోట్లు మిగిలాయ్‌!

14 Oct, 2017 04:57 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆధార్‌ కార్డు పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 900 కోట్ల డాలర్లు (రూ.58.22వేల కోట్లు) మిగిలాయని ఈ పథకం రూపశిల్పి నందన్‌ నీలేకని వెల్లడించారు. వాషింగ్టన్‌లో ‘డిజిటల్‌ ఎకానమీ–అభివృద్ధి’ అంశంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు నిర్వహించిన ప్యానెల్‌ చర్చలో ఈయన పాల్గొన్నారు.

వందకోట్లకు పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆధార్‌ కారణంగా లబ్ధిదారుల గుర్తింపులో అవినీతి గణనీయంగా తగ్గిందని నీలేకని పేర్కొన్నారు. ‘ఆధార్‌ వల్ల ప్రభుత్వానికి దాదాపు 9 బిలియన్‌ డాలర్లు మిగిలాయి. విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా నకిలీలను అరికట్టడంతో సరైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.   

మరిన్ని వార్తలు