‘ఇలా చేస్తే వారి ప్రాణాలు దక్కుతాయి’

6 Jun, 2020 15:51 IST|Sakshi

లండన్‌: కోవిడ్‌ చికిత్సకు ఉపకరించే కీలక విషయాలు తమ పరిశోధనలో వెల్లడయ్యాయని యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్‌ బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా వారి ప్లాస్మాలోని ప్రొటీన్స్‌ స్థాయుల్లో తేడాలున్నట్టు తెలిసిందన్నారు. బాధితుల ప్రొటీన్‌ స్థాయుల్లో మార్పులకు కారణమయ్యే బయోమేకర్స్‌ను పరిశీలించడం ద్వారా.. బాధితుల్లో వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతోందో తెలుసుకోవచ్చన్నారు. కోవిడ్‌ బాధితుల్లో కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే. మరికొందరు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణిస్తున్నారని అధ్యయనంలో భాగమైన కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 
(చదవండి: భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్‌)

ప్లాస్మాలో ప్రోటీన్‌ స్థాయులను బట్టి ఎవరికి అత్యవసర, ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స అవసరమో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఎందరో ప్రాణాలకు కాపాడుకోవచ్చని వారు ధీమా వ్యక్తం చేశారు. త్వరగా రక్త నమూనాలను పరీక్షించి ప్రోటీన్‌లలో తేడాలను గమనిస్తే.. ఆ వ్యక్తిలో కోవిడ్‌ తీవ్రత ఎలా ఉండనుందో తెలిసిపోతుందన్నారు. తమ స్టడీలో వెల్లడైన విషయాలు రోగి పరిస్థితి అంచనా వేసేందకు ఉపయోగపడతాయని అధ్యయనానికి నేత్వత్వం వహించిన ఫ్రాన్సిక్‌ క్రిక్‌ యూనివర్సిటీకి చెందిన మార్కస్‌ రాల్సర్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణ కోసం ఇవే కీలకం కానున్నాయని తెలిపారు.

వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న వివిధ దశలకు చెందిన 31 మందిపై తమ అధ్యయనం జరిగిందని రాల్సర్‌ వెల్లడించారు. వారిలో వ్యాధి తీవ్రతను బట్టి 27 రకాల ప్రొటీన్‌ స్థాయుల్లో వైవిధ్యతలు గుర్తించినట్టు చెప్పారు. మరో 17 మంది కోవిడ్‌ రోగులను, 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ప్రొటీన్‌ స్థాయులను కూడా పరిశీలించి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ నియమాల ప్రకారం.. రోగులను వర్గీకరించామని తెలిపారు. కాగా, సెల్‌ సిస్టమ్స్‌ అనే జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
(చదవండి: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు