మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

22 Jul, 2019 19:07 IST|Sakshi

అమెరికాలోని గల్ఫ్‌ మెక్సికోలో ఓ కొత్త షార్క్‌ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం 5.5 అంగుళాలు మాత్రమే ఉండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గత కొన్నెళ్లుగా షార్క్‌ చేపలపై, సముద్రాలలోని ప్లాస్టిక్‌పై అధ్యయనం చేస్తున్న తులనే విశ్వవిద్యాలయం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 1979 అనంతరం తొలిసారి అతి చిన్న షార్క్‌ చేపను గుర్తించినట్టు తెలిపారు. గతంలో 2010, 2013లలో దీనిని గుర్తించామని కానీ తమకు చిక్కలేదన్నారు.   

ఈ షార్క్‌ చేప దాని శరీరం నుంచి వచ్చే కాంతితో ఎదుగుతుందని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తెలుపుతోంది. దీంతో పాటు ఇతర జీవులను ఆకర్షించడానికి, వీటిపై దాడి చేసేవారిని దూరంగా ఉండమని హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2010 లో గల్ఫ్‌ ప్రాంతంలో తిమింగలాలపై అధ్యయనం చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కాంతిని ప్రసరించే మగ కైట్ఫిన్ షార్క్ కనుగొన్నారు. ఆ తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకుడు మార్క్ గ్రేస్  కాంతితో మెరిసే షార్క్‌ చేపను కనుగొన్నారు. ఎక్కువగా లోతు ఉండే సముద్ర జీవులపై పరిశోధనలు చాలా తక్కువగా జరుగుతున్నాయంటూ..  సముద్ర పైభాగంలోని నీటిలో నివసించే జంతువుల్లో 90 శాతం కాంతిని ప్రసరిస్తాయని ఎన్‌ఓఏఏ అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు