కరోనా వైరస్‌కు త్వరలో ‘వ్యాక్సిన్‌’!

30 Jan, 2020 17:03 IST|Sakshi

వుహాన్‌: చైనాలో ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు 170 మంది చనిపోవడం, అమెరికా, భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పౌరలు సహా వేలాది మందికి వైరస్‌ వ్యాపించిన నేపథ్యంలో యాంటీ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. ప్రధానంగా అమెరికాలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌’ సహా చైనా, ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ పరిశోధన విభాగాల్లో, ప్రైవేటు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు సరైన వ్యాక్సిన్‌ కోసం కృషి చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం ‘2019–ఎన్‌సీఓవీ’గా పిలుస్తున్న కరోనా వైరస్‌పై ప్రత్యేకంగా ఏమీ పరిశోధనలు జరపడం లేదు. ఇదివరకే మానవాళిపై దాడి చేసిన సార్స్, మెర్స్‌ వ్యాధుల నిరోధానికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు కొనసాగిస్తున్న పరిశోధనలను ముమ్మరం చేశారు. ఆ రెండు వ్యాధులు కూడా కరోనా వైరస్‌ కారణంగానే రావడంతో ప్రధానంగా ఆ పరిశోధనలనే కొనసాగిస్తూ, ఇప్పటి కొత్త రకం వైరస్‌ను పరిగణలోకి తీసుకున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఈ పరిశోధనలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి మానవులపై ట్రయల్‌ జరిపే స్థాయికి అవి చేరుకోలేదు. ముందుగా మూషికాలపై, ఆ తర్వాత మానవులపై ప్రయోగాలు ముగిసి వాక్సిన్‌ మందు అందుబాటులోకి రావలంటే కనీసం మరో మూడు, నాలుగు నెలలపాటు నిరీక్షించక తప్పదని ప్రస్తుతం ఈ పరిశోధనల్లో నిమగ్నమైన వైద్యులు తెలియజేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ మిచిగాన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ ఔబ్రీ గోర్ద్రన్‌ తెలిపారు. చైనాలోని వుహాన్‌ యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థికి కూడా ఈ కరోనా వైరస్‌ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో భారతీయుల్లో కూడా ఆందోళన తీవ్రమైంది.

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో ‘కరోనా’ కలకలం..

భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’

పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ను నివారిద్దామిలా!

మరిన్ని వార్తలు