నేలను తాకి ఎన్నాళ్లయింది..!

2 Mar, 2016 12:25 IST|Sakshi
ఏడాది తర్వాత భూమిపైకి ఏరుకున్నాక విజయ సంకేతం చూపుతున్న స్కాట్ కెల్లీ

డెకాగన్: అంగారక గ్రహాంపైకి మానవుణ్ని పంపేందుకు నాసా ఆధ్వర్యంలో పలు దేశాలు సంయుక్తంగా తలపెట్టిన మిషన్ టు మార్స్ ప్రయోగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్స్ యాత్రకు వెళ్లలాంటే వ్యోమగాలు సుదీర్ఘకాలంపాటు అంతరీక్షంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అసలు మనిషి స్పేస్ లో అంతకాలం ఉండగలడా? అందుకు వాతావరణం, శరీరం సహకరిస్తుందా? అనే కోణంలో చేపట్టిన ప్రయోగాలు.. స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియాంకోల రాకతో సఫలమైనట్లు తేటతెల్లమైంది.


మిషన్ టు మార్స్ లో భాంగా ఏడాది పాటు అంతరీక్షంలో గడిపిన అమెరికన్, రష్యన్ వ్యోమగాములు స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియోంకోలు బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి స్పేస్ షటిట్ లో బయలుదేరిన ఆ ఇద్దరూ కజకిస్థాన్ లోని డెకాగన్ శాటిలైట్ సెంటర్ వద్ద విజయవంతంగా భూమిపై పాదం మోపారు. అత్యధికా కాలం ఐఎస్ఎస్ లో గడిపిన రికార్డు వీరిద్దరే కావటం గమనార్హం.

 

స్కాట్, మిఖాయెల్ ల రాకతో నాసా సహా మిషన్ టు మార్స్ లో భాగస్వామ్యదేశాల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 345 రోజులపాటు అంతరీక్షంలో గడిపిన స్కాట్.. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్ లో పోస్టులు పెట్టేవారు. వాటిని నెటిజన్లు కూడా అద్భుతంగా ఆదరించారు. ఇటీవలే గొరిల్లా సూట్ లో ఐఎస్ఎస్ లో సందడి చేస్తూ స్కాట్ పెట్టిన పోస్టుకు విపరీతమైన స్సదన వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 27న స్కాట్, మిఖాయెల్ లు అంతరీక్ష కేంద్రానికి వెళ్లారు.

మరిన్ని వార్తలు