చిన్నారులూ క్షమించండి: ఆస్ట్రేలియా ప్రధాని

23 Oct, 2018 04:38 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని విద్యాసంస్థలు, మతపరమైన విద్యాసంస్థల్లో దశాబ్దాలపాటు లైంగిక వేధింపులకు గురైన వేలాది మంది బాలబాలికలకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ క్షమాపణలు చెప్పారు. వీరిని రక్షించడంలో తాము వైఫల్యం చెందామని అంగీకరించారు. నమ్మకం, మతవిశ్వాసాల మాటున ఈ తప్పులను దాచుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చర్చ్‌లు, అనాథాశ్రమాలు వంటి విద్యాసంస్థల్లో బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఐదేళ్లపాటు కొనసాగిన విచారణ నివేదిక సమర్పించింది. అనంతరం దీనిపై ప్రధాని మాట్లాడుతూ..‘మిమ్మల్ని(చిన్నారులు) కాపాడటంలో మేం విఫలమయ్యాం.. క్షమించండి. మీ(తల్లిదండ్రుల) నమ్మకాన్ని ఒమ్ము చేశాం. ఈ లైంగిక వేధింపుల పరిణామాలను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని క్షమాపణలు కోరుతున్నా’ అంటూ ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు