స్పెల్‌బీలో భారత సంతతి విద్యార్థుల ఘనత

1 Jun, 2019 05:02 IST|Sakshi

8 మంది విజేతల్లో ఆరుగురు మనవారే..!

94 ఏళ్ల చరిత్రలో ఇంతమంది విజేతలు కావడం ఇదే తొలిసారి

వాషింగ్టన్‌: ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బహుమతిని పొందిన 8 మంది విద్యార్థుల్లో ఏకంగా ఆరుగురు భారత సంతతి విద్యార్థులే ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్‌ గంధశ్రీ(13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్‌ సుందర్‌(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్‌ (13), అభిజయ్‌ కొడాలి(12), రోహన్‌ రాజా (13), క్రిస్టఫర్‌ సెర్రావ్‌(13), అలబామాకు చెందిన ఎరిన్‌ హొవార్డ్‌(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు