ఆ కార్లకు హ్యాకింగ్ ముప్పు!

1 Feb, 2016 17:05 IST|Sakshi
ఆ కార్లకు హ్యాకింగ్ ముప్పు!

లాస్ ఎంజిల్స్: సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ డ్రైవర్ లెస్ కార్లను తయారుచేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. అయితే ఈ తరహా కార్లతో కొత్త సమస్యలు రాబోతున్నాయని చెబుతున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశాలున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు వెల్లడించారు.
 
ఈ కార్ల తయారీలో ఉపయోగించే అత్యాధునిక కంప్యూటర్లు, సెన్సర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటి సాంకేతిక పరిఙ్ఞానమే హ్యాకింగ్కు గురయ్యే అవకాశాలను పెంచుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టిఫాన్ సావేజ్ తెలిపారు. హ్యాకింగ్ ద్వారా కారులోని బ్రేకులు, ఇతర ముఖ్యమైన వ్యవస్థను హ్యాకర్లు వారి చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయ్ అని సంబరపడిపోతున్న జనాలను ఈ పరిశోధన ఫలితాలు కలవరపెడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు