పోలీసును తిట్టి బుక్కయ్యాడు!

30 Jun, 2016 14:53 IST|Sakshi
పోలీసును తిట్టి బుక్కయ్యాడు!

పెన్హ్: ట్రాఫిక్ పోలీసును అవమానించినందుకు కంబోడియాలో ఓ ఉన్నతాధికారి పదవిని పోగొట్టుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ జనరల్ విభాగంలో డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న మామ్ శ్రీ వన్నా సోమవారం పెన్హ్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించారు. జరిమానా కట్టాలని ట్రాఫిక్ పోలీస్ గా కోరగా కట్టేందుకు నిరాకరించారు. అక్కడితో ఆగకుండా ట్రాఫిక్ పోలీసును అభ్యంతకర పదజాలంతో దూషించాడు. 'ఏఆర్ ట్రాఫిక్ పోలీస్' అంటూ దుయ్యబట్టారు. ఏఆర్ అనే పదం పిల్లలు, తమకంటే చిన్నవారిని అవమానించడానికి వాడతారు.

ఈ వ్యవహారంపై  కాంబోడియా ప్రధాని హన్‌సేన్‌ స్పందించారు. డైరెక్టర్ జనరల్ పదవి నుంచి మామ్ శ్రీ వన్నాను తొలగిస్తున్నట్టు ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. జూన్ 18న కోకాంగ్‌లో హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ప్రధాని హన్‌సేన్‌ కు ట్రాఫిక్ పోలీసులు దాదాపు రూ.250 జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు