కిమ్‌ దేశం మరో అణు పరీక్ష

3 Sep, 2017 13:25 IST|Sakshi
కిమ్‌ దేశం మరో అణు పరీక్ష

సాక్షి, సియోల్‌‌: ఉత్తరకొరియా మరో అణు పరీక్షను నిర్వహించినట్లు దక్షిణ కొరియా ఆదివారం పేర్కొంది. అభివృద్ధి పరచిన హైడ్రోజన్‌ బాంబును ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పరిశీలించినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొన్న కొద్ది గంటల్లోపే అణు పరీక్ష జరగడం గమనార్హం.

ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌గ్జిబేగమ్‌లో 6.3 తీవ్రతతో పేలుడు సంభవించినట్లు పేర్కొంది. దీంతో ఉత్తరకొరియాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని తెలిపింది. కాగా, ఉత్తరకొరియా అణు పరీక్ష నిర్వహించడంపై జపాన్‌, దక్షిణ కొరియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

వీటిని ధృవీకరిస్తూ ఉత్తరకొరియా తాము అణు పరీక్షలు నిర్వహించినట్లు ధృవీకరించింది. ఉత్తరకొరియా ఇప్పటివరకూ నిర్వహించిన అణు పరీక్షల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనది.  ఉత్తరకొరియా గతేడాది రెండు సార్లు అణు పరీక్షలను నిర్వహించింది. ఇక చైనా ఉత్తర కొరియా అణు పరీక్షను తీవ్రంగా ఖండించింది.

మరిన్ని వార్తలు