ఇటలీ నూతన అధ్యక్షుడిగా సెర్గియో మతారెల్లా

1 Feb, 2015 01:10 IST|Sakshi

రోమ్: ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మతారెల్లా(73) ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో దఫా ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు గాను 665 ఓట్లు గెలుచుకొని మతారెల్లా విజయం సాధించారు. జనవరి 14న అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జార్జియో నెపోలితానో స్థానంలో మతారెల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మతారెల్లా 2011 నుంచి ఇటలీ రాజ్యాంగ కోర్టు సభ్యునిగా ఉన్నారు. సిసిలి మాఫియా చేతిలో ఆయన సోదరుని హత్యానంతరం మతారెల్లా క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పలు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. మతారెల్లా అభ్యర్థిత్వాన్ని ప్రధాన మంత్రి మతాయో రెంజీ, తన పార్టీ(డెమోక్రటిక్ పార్టీ) సమర్థించగా, వామపక్షాలు, న్యూ సెంటర్-రైట్ పార్టీ, మధ్యస్థ పార్టీలు మద్దతిచ్చాయి.

>
మరిన్ని వార్తలు