లైంగిక ఆరోపణలు.. అందాల పోటీలకు బ్రేక్‌

22 Mar, 2018 20:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కారకాస్‌ : లైంగిక ఆరోపణల నేపథ్యంలో వెనెజులా అందాల పోటీలకు బ్రేక్‌ పడింది. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులకు పడక సుఖానికి అందించి కొందరు పోటీదారులు పెద్ద ఎత్తున్న డబ్బు తీసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోటీలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

వెనిజులాలో గత 40 ఏళ్లుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దఫా పోటీల్లో న్యాయనిర్ణేతలు, నిర్వాహకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ పోటీదారులు ఆరోపణలకు దిగారు. వెంటనే తెరపైకి వచ్చిన మాజీ పోటీదారులు... గతంలోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగాయని ఆరోపించారు. నిర్వాహకులతోపాటు బడా వేత్తలకు లైంగిక సుఖాన్ని అందించారని, తద్వారా డబ్బుతోపాటు కొందరు కిరీటాన్ని కూడా కైవసం చేసుకున్నారంటూ బాంబు పేల్చారు. 

ఈ ఆరోపణలు కాస్త తారా స్థాయికి చేరటంతో ఆన్‌లైన్‌లో పెద్ద ఉద్యమమే నడిచింది. దిగొచ్చిన నిర్వాహకులు కారాకస్‌లోని వేదికను మూసేస్తూ ఆడిషన్స్‌ను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించారు. ఈ ఆరోపణలపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, వెనెజులా ఇప్పటిదాకా ఏడు మిస్‌ యూనివర్స్‌, ఆరు మిస్‌ వరల్డ్‌ టైటిళ్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు