లాడెన్ డబ్బుతో ఎన్నికల బరిలో షరీఫ్!

1 Mar, 2016 01:17 IST|Sakshi
లాడెన్ డబ్బుతో ఎన్నికల బరిలో షరీఫ్!

ఇస్లామాబాద్: దివంగత పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ని ఎదుర్కొనేందుకు 1990 ఎన్నికల్లో నిలబడేందుకు కావాల్సిన భారీ మొత్తాలను ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ అల్ కాయిదా అధినేత లాడెన్ నుంచి పొందారని ఓ పుస్తకంలో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ ఉన్నతాధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామా ఖలీద్ వెలువరించిన ‘ ఖలీద్ ఖవాజా: షాహీదీ అమాన్’ పుస్తకంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

పాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు షరీఫ్ ప్రతినబూనడంతో ఆయనవైపు లాడెన్, ఖలీద్‌లు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. జియాల తుది దశలో 1990లో పీపీపీని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కావాల్సిన భారీ నగదు మొత్తాలను లాడెన్ నుంచి తీసుకున్నాడని, అధికారంలోకి వచ్చాక షరీఫ్ తన వాగ్దానాలను పక్కనబెట్టాడని ‘డాన్’ వార్తాసంస్థ సోమవారం ఓ కథనం ప్రచురించింది.

>
మరిన్ని వార్తలు