షిఫ్ట్ ఉద్యోగాలతో గుండెపోటు..

3 Jun, 2016 02:12 IST|Sakshi
షిఫ్ట్ ఉద్యోగాలతో గుండెపోటు..

హౌస్టన్: షిఫ్ట్‌ల ప్రకారం పనిచేసే ఉద్యోగులు గుండె పోటు, స్థూలకాయంతో పాటు ఇత ర ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మానవ శరీరం 24 గంటల సమయానికి అనుగుణంగా నిర్మితమైందని, తీసుకునే ఆహారం నుంచి నిద్ర, ఇంకా అనేక శారీరక ప్రక్రియలు ఏ సమయంలో చేయాలనేది అంతర్గత జీవక్రియలపై ఆధారపడి ఉంటాయని అమెరికాలోని ఏ అండ్ ఎమ్ హెల్త్ సెంటర్‌కు చెందిన డేవిడ్ ఎర్నస్ట్ వివరించారు. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన పరిశోధకుడు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు