రెస్టారెంటు ఫుడ్‌లో షాకింగ్‌ వస్తువు

17 Mar, 2017 20:55 IST|Sakshi
రెస్టారెంటు ఫుడ్‌లో షాకింగ్‌ వస్తువు

బీజింగ్‌: అన్ని కాకపోయినా కొన్ని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఆహారాన్ని తయారు చేసే సమయంలో చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తాయి. తింటే తినండి పోతే పోండి అన్నట్లు ప్రవర్తిస్తాయి. సరిగ్గా చైనాలో ఓ రెస్టారెంటు ఇందుకు నిదర్శనంగా కనిపించింది. ఎంతగా అంటే ఎప్పటికీ ఇంటి భోజనమే స్వచ్ఛమైనది, సురక్షితమైనది అని ఒట్టేసుకొని ఉండిపోయేటంతగా. అవును.. వీకెండ్‌ కదా అని రెస్టారెంటుకు వెళ్లిన ఇద్దరు యువకులకు బిత్తరపోయే అనుభవం ఎదురైంది.

చక్కగా ఆహారాన్ని ఆర్డర్‌ చేసి ఆరగిస్తుండగా వారికి అందులో కండోమ్‌ దర్శనం ఇచ్చింది. అప్పటికే వారు సగం భోజనం పూర్తి చేశారు కూడా. అది చూసి ఒక్కసారిగా అవాక్కయిన ఆ యువకులు తీవ్ర ఆగ్రహంతో వెయిటర్‌ను దగ్గరకు పిలిచి వెళ్లి మీ యజమానిని తీసుకురారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆహారంలో కండోమ్‌ బయటకు రావడం చూసిన పక్కనే ఉన్న యువతి షాక్‌ తిని అలాగే చూస్తుండి స్తబ్ధంగా మారిపోయింది. కుండలో ఉన్న ద్రవ ఆహార పదార్థాన్ని రెండు బ్లాక్‌ స్టిక్స్‌తో ఎవరికి వారే తీసుకొని తినడం ఆ రెస్టారెంట్‌ ప్రత్యేకత. అలా తినే క్రమంలో వారికి చూడకూడని వస్తువు అందులో కనిపించి తిన్న భోజనం కాస్త ఉన్నపలంగా కక్కేయాలన్నంత అనుభవం ఎదురైంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా