గర్ల్ఫ్రెండ్ను ఉతికి ఆరేశాడు

8 Jun, 2016 12:06 IST|Sakshi
గర్ల్ఫ్రెండ్ను ఉతికి ఆరేశాడు

న్యూయార్క్: ఓ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్కు చుక్కలు చూపించాడు. వరుస పంచ్లు ఇచ్చి కిందపడేసి మరి కొట్టాడు. అనంతరం ఆమె స్నేహితురాలిని కూడా పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత గర్ల్ ప్రెండ్ ని బుద్ధిగా తీసుకెళ్లి తన కార్లో కూర్చొబెట్టాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అది అమెరికాలోని ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్.. దాని ఎదురుగా విశాలమైన రోడ్డు. అక్కడే కార్లు పార్క్ చేసే చోటు. అక్కడ ఒకమ్మాయి అబ్బాయి గొడవ పడుతుండగా ఆ షాపింగ్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ లో ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశాడు. ఆ వీడియోలో ఏం ఉందంటే.. తొలుత కారు పార్కింగ్ ప్లేస్ వద్ద తూలుతూ ఉన్న ఓ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ పెదాలపై గట్టిగా చుంబించాడు.

అంతకుముందు అతడు ఏం తప్పు చేశాడో ఏమోగానీ ఆ అమ్మాయి అతడి ముఖంపై, ఛాతీపై పంచ్లు చేయడం మొదలుపెట్టింది. కాలితో కూడా తన్నడం ప్రారంభించింది. అలాగే చేస్తుండగా అతడు మాత్రం ఆమెను ప్రేమగా దగ్గరకు లాక్కోవడం చేశాడు. అయినా, ఆ అమ్మాయి అదే తీరుతో వ్యవహరించింది. తన పంచ్లు కొనసాగించింది. అయితే, అతడు ఏదో చెబుతూ కౌగిలించుకొని ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు.

అయినా వినకుండా ఆమె అలాగే కొడుతూ తిడుతూ ఉండటంతో ఆగ్రహం ఆపుకోలేని అతడు ఫటాఫటా పంచ్లు గుప్పించాడు. దెబ్బకు ఆ గర్ల్ ప్రెండ్ కిందపడిపోయింది. ఆ తర్వాత కూడా కొట్టాడు. అనంతరం ఆమె కాలు చెప్పు ఊడిపోతే తొడిగే ప్రయత్నం చేశాడు. ఈ గొడవ సమయంలో తన స్నేహితురాలు వారించేందుకు రాగా ఆమెను కూడా ఉరికించి కొట్టే ప్రయత్నం చేశాడు. అనంతరం కిందపడిపోయిన తన గర్ల్ఫ్రెండ్ను అమాంతం చేతుల్లోకి తీసుకొని మెల్లగా వెళ్లి కార్లో కూర్చొబెట్టాడు. ఈ రెండు నిమిషాల వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

మరిన్ని వార్తలు