హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై యూఎస్‌ హెచ్చరిక

25 Apr, 2020 11:50 IST|Sakshi

వాషింగ్టన్‌ : యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. కరోనా రోగులకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనాను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నియంత్రిస్తుందనే దానిపై సరైన ప్రయోగం జరగలేదని, దీనిని ఎక్కువగా వాడటం మూలంగా ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ అభిప్రాయడింది. అంతేకాకుండా హృదయ సంబంధిత వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకే ఎఫ్‌డీఏ చీఫ్‌ ఎమ్‌. స్టీఫెన్‌ ఓ ప్రకటక విడుదల చేశారు. అమెరికాలో వైరస్‌ సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి స్థానిక వైద్యులే అతనికి తగిన ఔషధాన్ని వాడాలని ఆయన సూచించారు. వైరస్‌ నియంత్రణకు మందును కనిపెట్టే ప్రయోగాలు వేగవతంగా జరుగుతున్నాయన్నారు. కాగా ప్రమాదకర కరోనా వైరస్‌కు ఇంతవరకు మందులేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి రోగిని కాపాడేందుకు మలేరియా నియంత్రణకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడొచ్చ భారత్‌ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది. (భారత ప్రజలకు ధన్యవాదాలు: ట్రంప్‌)

ఈ క్రమంలోనే ఆ మెడిసిన్‌ను తమకు కూడా సరఫర చేయాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు భారత్‌ను అభ్యర్థించాయి. దీనికి ఎఫ్‌డీఏ కూడా గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చింది. దీంతో అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలకు భారత్‌ ఈ ఔషధాన్ని ఎగుమతి చేసింది. అయితే కరోనాను నియంత్రించే శక్తి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందుకు ఉందని వైద్యుల ఇప్పటి వరకు ధృవీకరించలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం కరోనా రోగులకు ఇదే మందును ఉపయోగి​స్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు