ప్రపంచానికి సవాల్ విసిరింది..!

11 Feb, 2016 13:52 IST|Sakshi
ప్రపంచానికి సవాల్ విసిరింది..!

మెల్ బోర్న్: ఇండో-అమెరికన్ సిక్కు నడుటు వారిస్ అహ్లువాలియా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా అదే సమయంలో  ఓ సిక్కు యువతి ప్రపంచాన్ని షేక్ చేసేసింది. తన పాటతో ప్రపంచానికి సవాల్ విసిరిందని చెప్పవచ్చు. జాతి వివక్ష అంశంపై తాను రూపొందించిన పాటతో 21 ఏళ్ల సుఖ్ జిత్ కౌర్ ఖల్సా పెద్ద ప్రయోగమే చేసిందని చెప్పవచ్చు. ఈ నెల 8న ఆస్ట్రేలియా టాలెంట్ షోలో పాల్గొన్న ఆమె పాడిన పాటకు మంత్ర ముగ్దులైన అక్కడున్న ఆస్ట్రేలియా వాసులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఆ యువతి పాట పాడిన ఈ వీడియోను షేర్ చేస్తుండటంతో తక్కువ సమయంలో ప్రపంచమంతటా వ్యాపించింది.

'ఇది నిజంగా చాలా సిగ్గుచేటు.. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను..  నేను అలాంటి ఇలాంటి వ్యక్తిని కాదు.. అసలుసిసలైన సిక్కును' అని తన పాటతో చెప్పింది. తొలుత ఆమె స్టేజీ మీదకు వెళ్లేటప్పుడు అక్కడున్న వారి నుంచి కాస్త నిరసన వ్యక్తం అయింది. పాట లాంటి పద్యం అందుకున్న తర్వాత సుఖ్ జిత్ తనదైన శైలిలో సిక్కు జాతి గురించి తన మాటల్లో తెలిపింది. తన అంకుల్ తలపాగాను ఒకరు తొలగించాలని యత్నించారని, అలా చేస్తే తాము ఎంత బాధకు గురవుతామన్న విషయాన్ని పద్యం రూపంలో పాడింది. ఆమెలో చాలా కోపంతో కూడిన అసహనం ఉంది. ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలని ఈ కార్యక్రమం న్యాయనిర్ణేతల్లో ఒకరైన ఇయాన్ డిక్సన్ వ్యాఖ్యానించారు. ఫ్యాషన్ డిజైనర్, నటుడు వారిస్ అహ్లువాలియాను విమానం ఎక్కకుండా ఎయిర్ పోర్టు అధికారులు ఈ నెల 8న అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే రోజున ఓ షో లో పాల్గొన్న సుఖ్ జిత్ కౌర్ తన బాధను ప్రపంచానికి తెలిసింది.