అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్

3 Apr, 2017 11:30 IST|Sakshi
అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్
న్యూఢిల్లీ : వీసాల జారీల్లో ఇండియన్స్ కు విదేశాలు ఝలకిస్తున్నాయి. వీసా జారీల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న అమెరికా బాటలోనే సింగపూర్ నడుస్తోంది.  దేశీయ ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తోంది. సింగపూర్ లో వర్క్ చేసేందుకు ఐటీ నిపుణులు పొందే వీసాలను సింగపూర్ లో భారీగా తగ్గిస్తున్నట్టు తెలిసింది. వాణిజ్యపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద(సీఈసీఏ) సమీక్షను పక్కనపెడుతోంది. ప్రతిభావంతులైన స్థానికులను భారత కంపెనీలు నియమించుకోవాలంటూ అమెరికా మాదిరి ఆదేశాలు జారీచేస్తోంది.
 
దీంతో సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇతర దేశాలకు తమ ఆపరేషన్స్ ను తరలించాలని యోచిస్తున్నాయి. హెచ్సీఎల్ నుంచి టీసీఎస్ వరకు అన్ని కంపెనీలు సింగపూర్ కు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించేశాయి. కానీ ఆ కంపెనీలకు ఈ ఏడాది ప్రారంభం నుంచి వీసా సమస్యలు ప్రారంభమయ్యాయి. వీసా జారీలు పడిపోతున్నాయి. స్థానికులను నియమించుకోవాంటూ దేశీయ కంపెనీలకు ఆదేశాలు వస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖరన్ చెప్పారు. ప్రాక్టికల్ గా మన ఐటీ నిపుణులకు వీసాలను కూడా ఆపివేస్తున్నట్టు మరో ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా పేర్కొన్నారు.
 
నిర్ధిష్ట ఆర్థిక ప్రమాణాలుండాలంటూ ''ఎకనామిక్ నీడ్స్ టెస్ట్'' పేరుతో దేశీయ నిపుణులకు యాక్సస్ కల్పించకుండా సింగపూర్ అథారిటీలు అడ్డుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సర్వీసు ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని, స్థానికులకు తొలి ఛాన్స్ ఇవ్వాలంటూ కఠినతరమైన నిబంధనలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ద్వీపకల్ప దేశంలో విదేశీ నిపుణులకు అనుమతి కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేశం సింగపూరే. ఈ నేపథ్యంలో దిగుమతి డ్యూటీలను కట్ చేస్తూ ఉత్పత్తులను అనుమతించే విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దేశీయ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. 
 
మరిన్ని వార్తలు