‍కరోనా: సింగపూర్‌ కంపెనీ మానవ ట్రయిల్స్‌

10 Jun, 2020 16:05 IST|Sakshi

సింగపూర్‌: ‍సింగపూర్ బయోటెక్నాలజీ సంస్థ, టైచన్, కోవిడ్ -19 చికిత్సలో భాగంగా  మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి మనుషులపై క్లినికల్‌ ప్రయోగాలను వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్‌ను  లక్ష్యంగా చేసుకుని మోనోక్లోనల్ యాంటీబాడీ  ప్రోటీన్ అయిన టీవై027 సామార్థా‍న్ని నిర్ణయించడానికి ఆరోగ్యకరమైన వాలంటీర్లపై మొదటి దశలో దీనిని నిర్వహిస్తామని తెలిపారు. మోనోక్లోనల్‌ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ ద్వారా శరీరంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి ప్రతిరోధకాలు ఉత్పన్నమవుతాయి. సహజంగా శరీరంలో ఉండే ప్రతిరోధకాలలాగే ఇవి కూడా ప్రవర్తిస్తాయి. రోగులకు చికిత్స అందించడానికి వీటిని పెద్ద మొత్తంలో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది.  

(కోవిడ్‌-19 : భారీగా మెరుగుపడిన రికవరీ రేటు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా