అక్కడ కార్లపై నిషేధం

24 Oct, 2017 14:34 IST|Sakshi

సింగపూర్‌ : రహదారులపై భరీదైన బైక్‌లు, కార్లలో జామ్‌..జామ్‌ అంటూ దూసుకుపోవడం చాలామందికి సరదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇటువంటి సన్నివేశాలే కనిపిస్తాయి. కార్లు.. బైక్‌లో నిత్యావసరాల జాబితాలో చేరిపోవడంతో సగటున ప్రతి ఇంటికి కారో.. బైక్‌లో ఉంటోంది. దీంతో రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మనదేశంలోనూ.. ప్రధానంగా ఢిల్లీ-గుర్గావ్‌ హైవే మీద ట్రాఫిక్‌ సమస్యలను మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆధునిక రవాణా వ్యవస్థకు కేంద్రగా నిలిచిన సింగపూర్‌లోనూ ట్రాఫిక్‌ జామ్‌లు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది.

ఆసియాలో అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్‌ ఒకటి. ఇక్కడ వ్యక్తిగత వాహనాలు సంఖ్య అధికం కావడంతో రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు అధికంగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం​ తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి సింగపూర్‌లో వ్యక్తిగత వాహనాలను అంచెలంచెలుగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజా రవాణ వ్యవస్థకు ఊపు తీసుకురావడంతో పాటు.. వ్యక్తిగత వాహనాలు ఉపయోగించాలనుకునే వారు.. భారీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి ఏడాది 0.25 శాతం వాహనాలను తగ్గిస్తూ.. చివరకు వ్యక్తిగత వాహనాలు లేకుండా చేయాలన్నది తమ ఆలోచనగా సింగపూర్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆథారిటీ (ఎల్‌టీఏ) పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం సింగపూర్‌లో వ్యక్తిగత వాహనాన్ని కొనుగోలు చేయడం అనేది అత్యంత ఖరీదైన వ్యవహరం. కారును కొనడంతో పాటు.. దానిని పదేళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌‘ కింద 2లక్షల 50 వేల రూపాయాలు చెల్లించాలి. అంతేకాక ప్రభుత్వం విధించిన వివిధరకాల పన్నులతో కార్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి, టయోటా కరోలా ఆల్టీస్‌, అయిదు డోర్ల సెడాన్‌ కారు ఖరీదు.. రూ. 52 లక్షలకు చేరింది. సింగపూర్‌లోని భూభాగంలో ఇప్పటికే 12 శాతాన్ని రహదారుల నిర్మాణం కోసం వినియోగించినట్లు ఎల్‌టీఏ అధికారులు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా