కరోనాతో మరో ప్రముఖ గాయకుడు మృతి

2 Apr, 2020 11:05 IST|Sakshi

కరోనా వైరస్‌తో పోరాడుతున్న మరో గాయకుడు మృత్యువాత పడ్డారు. పాటల రచయిత, గాయకుడు ఆడమ్‌ ష్లెసింగర్‌(52) కరోనా సమస్యతో మరణించారు. ఆయన గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత. అలాగే పాప్‌ రాక్‌బాండ్‌ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ వ్యవస్థాపకుడు. ఆడమ్‌ మరణాన్ని ఇటీవల కరోనా బారిన పడిన నటుడు టామ్‌ హంక్స్‌ ట్విటర్‌ ద్వారా దృవీకరించారు. ‘ఆడమ్‌ ష్లెసింగర్‌ లేకుండా ప్లేటోన్‌ ఉండదు. అతడు కోవిడ్‌-19 చేతిలో ఓడిపోయాడు. ఇది విచారకర రోజు’అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా టామ్‌, అతని భార్య రీటా విల్సన్‌కు గత నెలలో కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్న వీరు ప్రస్తుతం అమెరికాలోని తమ ఇంటికి తిరిగి వెళ్లారు. (కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి)

కాగా ఆడమ్‌ 1995లో న్యూయార్క్‌లో ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ అనే రాక్‌ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్‌ చిత్రం ’దట్‌ ధింగ్‌ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు. ఈ చిత్రం ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు ఎంపికైంది. ఆడమ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్‌ క్రిస్మస్‌’కి ఆడమ్‌ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు. ఆడమ్‌ మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి)

ధారావిలో తొలి మరణం.. అధికారులు అలర్ట్‌ 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు