కరోనాతో ప్రముఖ సింగర్‌ మృతి

30 Mar, 2020 09:45 IST|Sakshi
జోయ్‌ డిఫ్పీ

వాషింగ్టన్‌ : ప్రముఖ కంట్రీ సింగర్‌, గ్రామీ అవార్డు విజేత జోయ్‌ డిఫ్పీ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. మూడురోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటున్నానని ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ నేను, నా కుటుంబం ఈ సమయంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. అభిమానులకు మేమొక్కటే చెప్పదల్చుకున్నాం.. కరోనా మహమ్మారినుంచి తప్పించుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండండ’ని పేర్కొన్నారు. ఓక్లహోమాలో జన్మించిన 61ఏళ్ల జిఫ్పీ 1990లలో ‘ పికప్‌ మ్యాన్‌’ ప్రాప్‌ మి అప్‌ బిసైడ్‌ ది జ్యూక్‌ బాక్స్‌ ’ వంటి చాలా హిట్‌ సాంగ్స్‌ను స్వరపరిచారు.  (అమెరికా: తారాస్థాయికి చేరనున్న కరోనా మరణాలు )


జాన్‌ ప్రైన్‌

విషమంగా సింగర్‌ జాన్‌ ఆరోగ్యం
కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికన్‌ సింగర్‌, గ్రామీ అవార్డ్‌ విజేత జాన్‌ ప్రైన్‌(73) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.  కరోనా లక్షణాలతో జాన్‌ గత గురువారం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. శనివారం ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు. లోగడ గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డ ఆయన వాటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కొద్దినెలల క్రితం జాన్‌కు గుండెపోటు రావటంతో సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కాగా, జాన్‌ ప్రైన్‌ భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ రావటం గమనార్హం.

మరిన్ని వార్తలు