అదేపనిగా కూర్చుంటే  మతిమరుపు ఖాయమట! 

13 Apr, 2018 23:31 IST|Sakshi

లాస్‌ ఏంజిలెస్‌ :  సాధారణంగా వయసు పైబడితేనో, మానసిక ఒత్తిడి ఎక్కువైతేనో మతిమరుపు వస్తుందని చెబుతారు. కొన్నిసార్లు మెదడుకు గాయమైనా కూడా మతిమరుపు వస్తుంది. కానీ అదేపనిగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా కూడా మతిమరుపు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఒకరు నేతృత్వం వహించిన బృందం డిమెన్షియాకు కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. గంటల తరబడి కూర్చొని, పనిలో నిమగ్నమయ్యేవారు మధ్యవయసుకు వచ్చేసరికి డిమెన్షియాబారిన పడుతున్నారని గుర్తించారు.

ఇందుకోసం 45 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న 35 మందిపై పరిశోధన చేశారు. వారి ఫిజికల్‌ యాక్టివిటీ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత పరిశీలిస్తే.. కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే మెదడు భాగం.. అదేపనిగా కూర్చొని పనిచేసే వ్యక్తుల్లో అభివృద్ధి చెందకపోవడాన్ని గుర్తించారట. దీనివల్ల అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తేలిందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రభా సిద్ధార్థ తెలిపారు.    

మరిన్ని వార్తలు