చైనాలో కూలిన నిర్మాణం.. ఆరుగురు మృతి

23 Aug, 2016 14:28 IST|Sakshi

బీజింగ్ః నిర్మాణ దశలో గేటు కూలడంతో చైనా బీజింగ్ లోని సిచువాన్ ప్రావిన్స్ లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న రెండు భవనాల మధ్య గేటు కూలిపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. చైనా నైరుతి నగరం లాంగ్ ఝాంగ్ లో కూలీలు కాంక్రీట్ పోస్తుండగా  ప్రమాదం సంభవించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హువా  వెల్లడించింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

>
మరిన్ని వార్తలు