స్మాగ్ ఫ్రీ .. రింగ్ గిఫ్ట్..

3 Jul, 2016 01:44 IST|Sakshi
స్మాగ్ ఫ్రీ .. రింగ్ గిఫ్ట్..

వాతావరణ కాలుష్యం.. ఈ పేరు చెబితేనే ప్రపంచంలోని అనేక దేశాలు వణికిపోతాయి. దీని వల్ల కలిగే అనర్థాలకు అంతే లేదు. మొన్నీమధ్య కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని చైనా రాజధాని బీజింగ్‌లో ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సంఘటన  చూసి డచ్‌కు చెందిన డాన్ రూసర్ గార్డె కాలుష్యానికి విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూరిఫయర్ కనుగొన్నాడు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కణాలను తన వైపు ఆకర్షించి స్యచ్ఛమైన గాలిలా మార్చే స్మాగ్ ఫ్రీ టవర్‌కు రూసర్ రూపకల్పన చేశాడు. అంతే కాకుండా కాలుష్య కణాలను ఆ టవర్ కంప్రెస్ చేసి డైమండ్ రూపంలో ఉన్న రాళ్లను ఉత ్పత్తి చేస్తుంది.

చూడడానికి అందంగా ఉండే ఈ రాళ్ల రూపంలో ఉన్న వస్తువు ఆభరణంగా వాడడానికి పనికొస్తుంది. ఇది ఇయాన్ టెక్నాలజీతో పనిచేస్తుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ చుట్టు పక్కల పరిసరాలను 75 శాతం వరకు క్లీన్‌గా ఉంచగ లుగుతుందని గార్డె తెలిపాడు. ఈ టవర్‌ను తొలిసారిగా సెప్టెంబర్‌లో బీజింగ్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మాగ్ ఫ్రీ టవర్ వాతావరణ కాలుష్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాడు. హాలండ్‌లో నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో స్మాగ్ ఫ్రీ టవర్ మంచి ఫలితాలను ఇచ్చింది. బీజింగ్‌లో అమర్చిన తర్వాత ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వాడనున్నారు.

మరిన్ని వార్తలు