ఇది భలే బంతి ‘బల్లీ’

8 Jan, 2020 17:34 IST|Sakshi

లాస్‌ ఏంజెలిస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వినియోగదారుల ప్రదర్శనలో శ్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బంతి రూపంలో ఉన్న ఓ చిన్న రోబోను మంగళవారం ఆవిష్కరించింది. బల్లీగా నామకరణం చేసిన ఈరోబో వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది దానికున్న చిన్న చక్రాల ద్వారా ఇల్లంతా తిరుగుతూ అందులో అమర్చిన కెమెరా ఇంటికి కాపలా కాస్తుంది. ఇంటికి వచ్చే , పోయే వారి గురించి యజమానిని హెచ్చరిస్తుంది. పెద్ద వాళ్లు ఇంట్లో నడిచేందుకు తోడ్పడుతుంది. 

అది మన ముందంటే ముందు, మన వెనకంటే వెనక నడుస్తూ కదలికలను రికార్డు చేస్తుంది. రమ్మంటే వస్తుంది. దూరంగా పొమ్మంటే పోతుంది. సెల్‌ఫోన్‌ ద్వారానే కాకుండా వాయిస్‌ కాల్‌తో కూడా ఈ బంతి లాంటి రోబో స్పందిస్తుంది. హలో అంటే హలో చెబుతుంది. పెద్ద వాళ్ల చేతుల్లో రిమోట్‌ కంట్రోల్లా కూడా పనిచేయడం ఇందులో ఉన్న ఇంకో విశేషం. ఈ రోబో టీవీ, టేప్‌ రికార్డర్, రేడియో లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నింటినీ ఆన్‌ చేయమంటే ఆన్‌ చేస్తుందీ, ఆఫ్‌ చేస్తుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలకు కంపెనీ ఇవ్వడం ఇందులోని మరో విశేషం. శ్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఈవో హెచ్‌ఎస్‌ కిమ్‌ దీన్ని ప్రదర్శించి చూపారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు