స్మార్ట్‌ఫోన్‌ వాడటంతో మానసిక రుగ్మతలు!

31 May, 2017 02:40 IST|Sakshi

మెల్‌బోర్న్‌: అర్ధరాత్రి దాటినా కూడా మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా! అయితే మీరు మానసిక రుగ్మతలకు లోను కాబోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువత నాణ్యమైన నిద్రను పొందలేకపోవడం, స్వీయ నియంత్రణను కోల్పోవడం వంటి సమస్యలతోపాటు మానసిక రుగ్మతలతో బాధపడతారని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 1,100 మంది 8 నుంచి 11 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులపై అధ్యయనం నిర్వహించి వెల్లడించారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎనిమిదేళ్ల వయసు కలిగిన విద్యార్థుల్లో దాదాపు 85 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారని, వీరిలో 1/3 వంతు మంది అర్ధరాత్రి దాటిన తర్వాత తాము ఫోన్‌ వినియోగించబోమని చెప్పారని వెర్నన్‌ తెలిపారు. మూడేళ్ల తర్వాత వీరిలో 93 శాతం మంది సొంత స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారని, కేవలం 22 శాతం మంది మాత్రమే అర్ధరాత్రి అనంతరం స్మార్ట్‌ఫోన్‌ వినియోగించబోమని చెప్పినట్లు తెలిపారు. అయితే వీరి వయసు పెరిగే కొద్దీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌ను వాడటం పెరిగిందని, వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించడంతోపాటు, నిద్రలేమి సమస్యలు తీవ్రం అయ్యాయని వెర్నన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు