ఇంగ్లండ్ జైళ్లలో నో స్మోకింగ్

21 Sep, 2013 01:45 IST|Sakshi

 లండన్: ఇంగ్లండ్, వేల్స్‌లోని అన్ని జైళ్లలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించనున్నట్లు అక్కడి జైళ్ల శాఖ అధికారులు ప్రకటించారు. జైళ్లలో ధూమపానం వల్ల తాము ప్యాసివ్ స్మోకింగ్(ఇతరులు వదిలిన పొగను పీల్చడం)కు గురవుతున్నందున నష్టపరిహారం చెల్లించాలంటూ సిబ్బంది కోరే అవకాశం ఉండటంతో ఆందోళన చెందుతున్న జై ళ్ల శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని హఠాత్తుగా మానివేస్తే ఉపసంహరణ ఇబ్బందులు కలుగుతాయి. కొందరు ఖైదీలు హింసకూ పాల్పడే ప్రమాదం ఉన్నందున.. వారికి కొన్నాళ్లపాటు నికోటిన్ ప్యాచ్‌లు సరఫరా చేయాలని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి నైరుతి ఇంగ్లాండ్‌లోని జైళ్లలో తొలుత 12 నెలలపాటు పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారని ఈ మేరకు శుక్రవారం ‘టైమ్స్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

మరిన్ని వార్తలు